అలయన్స్ ఫర్ రెస్పాన్సిబిల్ ఆక్వాకల్చర్
అలయెన్స్ ఫర్ రెస్పాన్సిబిల్ ఆక్వాకల్చర్ (ARA) అనేది ఆక్వాకల్చర్ లో చేపల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక వినూత్న వ్యవసాయ ఆధారిత కార్యక్రమం. ఈ ARA 2021 లో ప్రారంభమైంది మరియు ఇప్పుడు మేము ఈ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీని సపోర్ట్ చెయ్యడానికి 120 కి పైగా చెరువులతో పనిచేస్తున్నాము. ఈ ఇండస్ట్రీ
మేము చేపల సంక్షేమాన్ని ఎందుకు మెరుగుపరుస్తున్నాము?
ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న రైతులతో కలిసి చేపల పెంపకానికి వీలుగా ఉన్న వారి చెరువుల్లో వాళ్ళు ఉపయోగించే పద్ధతులను మెరుగుపరచడానికి మేము పనిచేస్తాము. చేపల సంక్షేమాన్ని మెరుగుపరచడం వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి, ఆరోగ్యకరమైన సమాజం, స్థిరమైన పర్యావరణం మరియు మరీ ముఖ్యంగా చేపల పెంపకానికి చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము.
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మా పని చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
చేపల సంక్షేమాన్ని మేము ఎలా మెరుగుపరుస్తాం
ARAలో చేరే రైతులు నిల్వ సాంద్రత పరిమితికి కట్టుబడి ఉంటారు మరియు నీటి నాణ్యతను ఉంచాల్సిన రేంజ్ లో ఉంచుతారు, ఇది చేపల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఈ మార్పులు స్ట్రెస్ ని తగ్గించడానికి, స్థితిస్థాపకతను పెంచడానికి మరియు చేపల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి అనుమతిస్తాయి. నీటి నాణ్యతను మెరుగుపరచడానికి మేము రైతులతో ఎలా పని చేస్తామో ఈ క్రింది గ్రాఫ్ వివరిస్తుంది.
మా ప్రభావం
153
ARA కు కట్టుబడిన చెరువులు
22,90,000
సంక్షేమ కార్యక్రమాల ద్వారా సపోర్ట్ పొందిన చేపలు
6,364
నిర్వహించిన మొత్తం నీటి నాణ్యత ఎనాలసిస్ లు
92%
దిద్దుబాటు చర్యల అమలు తర్వాత నీటి నాణ్యత మెరుగుదల
ARAలో చేరడం
నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల రైతులు ARAలో చేరడానికి అర్హులు. ARAలో చేరిన తర్వాత, మీరు మా సంక్షేమ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి మరియు డానికి ప్రతిఫలంగా మీరు వివిధ ప్రయోజనాలను పొందుతారు.
అంచనాలు
సిఫార్సు చేసిన స్థాయిలో స్టాకింగ్ చెయ్యడం
మీ స్థానిక FWI ప్రతినిధి ద్వారా రికమండ్ చెయ్యబడ్డ నీటి నాణ్యతను మెరుగుపరచడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం
మీ స్థానిక FWI ప్రతినిధిని మీ చెరువుకి యాక్సెస్ ఇవ్వడం
ప్రయోజనాలు
ఉచిత నీటి నాణ్యత పర్యవేక్షణ
ఉత్తమ నిర్వహణ పద్ధతులపై ఉచిత సలహాలు
ఆక్వాకల్చర్ క్రెడిట్ పథకాలను పొందడంలో సహాయం అందించబడుతుంది
భవిష్యత్తులో మార్కెట్ లింకేజీలు పొందే అవకాశం ఉంటుంది
మీ స్థానిక FWI ప్రతినిధిని మీ చెరువుకి యాక్సెస్ ఇవ్వడం
ARA వనరులు
For Nellore:
For Eluru:
నీటి నాణ్యత దిద్దుబాటు చర్యలు
మీరు మా ప్రోగ్రామ్ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారా? అయితే మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ను సంప్రదించండి
మీరు చేపల సంక్షేమం యొక్క ప్రయోజనాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పరిశోధనా సంస్థ లేదా కార్పొరేషనా? కార్పొరేట్ మరియు సంస్థాగత భాగస్వామ్యాలను అన్వేషించడానికి మమ్మల్ని సంప్రదించండి.