top of page

మా టీమ్

ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇండియా అనేది చేపల బాధలను వీలైనంత వరకు తగ్గించాలనే సాధారణ అభిరుచితో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో రూపొందించబడింది. వాటిని తెలుసుకోవడానికి చదవండి.

IMG20200929160037.jpg
కార్తీక్ పులుగుర్త

కార్తీక్ కు జంతు సంక్షేమం మరియు నైతిక జీవనోపాధి రంగంలో  నేపథ్యం ఉంది. ఈయన జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి డిప్లొమాసీ, లా  & బిజినెస్ (MA DLB)లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇండియాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ లో  PhD స్కాలర్ గా ఉన్న ఈయన గతంలో యూనివర్సిటీ యానిమల్ లా సెంటర్ ను మేనేజ్ చేశారు. అక్కడ ఉన్నప్పుడు, అతను భారతదేశంలో పారిశ్రామిక గుడ్ల ఉత్పత్తికి సంబంధించిన అనైతిక పద్ధతులపై వెలుగుచూసే పరిశోధనను చేపట్టారు. ఆయన తెలుగు దేశం పార్టీకి చెందిన పదహారు మంది పార్లమెంటు సభ్యులకు పరిశోధన మరియు జీవనోపాధి సలహాదారుగా కూడా పనిచేశారు. కార్తిక్ జంతు మరియు మనుషుల బాధలను అంతం చెయ్యడానికి నిబద్ధతో కట్టుబడి ఉన్నారు మరియు మార్పు కోసం బాటమ్ అప్ పద్దతిని బాగా నమ్మారు.

మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా

IMG_20200125_140734.jpg
శ్రీ రంగ్ కె

శ్రీ రంగ్ ఎప్పుడూ జంతువుల బాధలను సాధ్యమైనంత వరకు తగ్గించడానికి పని చేస్తూ ఉంటారు. ఈయన FWI ఇండియా కో-డైరెక్టర్ గానే కాకుండా రొయ్యల సంక్షేమ ప్రాజెక్టుకు ఇండియా కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. జంతు హక్కులు మరియు సంక్షేమంలో ఎనిమిది సంవత్సరాల అనుభవం మరియు ప్రకటనలలో అతని నేపథ్యంతో, ఇతను వివిధ ట్రేడ్ షోలు మరియు భారతీయ సంస్థలకు సృజనాత్మక వ్యూహకర్తగా పనిచేశాడు.

కో-డైరెక్టర్

Professional Headshot.jpg
సూర్య పాలి

సూర్యకి న్యాయశాస్త్రంలో నేపథ్యం ఉంది. తర్వాత ఆయన ఎఫెక్టివ్ ఆల్ట్రుయిజం రంగంలో దాతృత్వ సలహాలు, పరిశోధన, ఆపరేషన్స్, అలాగే కమ్యూనిటీ బిల్డింగ్ వంటి విభాగాల్లో పనిచేశారు. Fish Welfare Initiative India Foundation (FWI IF) లో చేరే ముందు, ఆయన అస్సాంలోని గౌహతిలో పూర్తిగా కొత్తగా రెండు లాభాపేక్షలేని సంస్థల శాఖలను స్థాపించి నడిపించారు. వాటిలో ఒకటి ఆకలి నివారణపై పనిచేసింది, మరొకటి వెనుకబడిన పిల్లలకు విద్య అందించడంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలో బాధను తగ్గించాలనే ఆయన లోతైన కర్తవ్య భావం, అలాగే చేపల రైతుల సంక్షేమం అత్యంత ప్రభావవంతమైనదిగా మరియు తక్కువగా గుర్తింపు పొందిన రంగాలలో ఒకటిగా ఆయనకు ఉన్న నమ్మకం, ఇవే ఆయనను FWI IF లక్ష్యానికి దగ్గర చేశాయి.

ప్రాజెక్ట్ మేనేజర్

bottom of page