top of page

Fish Welfare Initiative India

ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇండియా మన భారతదేశంలో ఉన్న చేపల జీవితాలను మెరుగుపరచడంలో బాగా కష్టపడి పనిచేస్తుంది.

చేపల సంక్షేమం ఎందుకు అవసరం?

దేశంలో చాలా చేపలు పెరుగుతున్నాయి.

ప్రతి సంవత్సరం 3 నుండి 14 బిలియన్ చేపలను పెంచుతున్నారు. ఇది భారతదేశంలోని అన్ని ఇతర సకశేరుక జంతువుల సంఖ్య కన్నా దాదాపు పది రెట్లు ఎక్కువ!

Home Page- (2).png
_RMA8560.jpg

కార్ప్‌లు ఆక్వాకల్చర్ చెరువు ఉపరితలం దగ్గర ఈత కొడతాయి, బహుశా అవి ఆహారం తీసుకుంటున్నాయని లేదా ఆక్సిజన్‌ను కోరుతున్నాయని సూచిస్తున్నాయి

FWI చేపల సంక్షేమాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?

పరిశోధన మరియు అభివృద్ధి

DP at lab.jpg

రాజమహేంద్రవరంలోని మన ఫీల్డ్ ఆఫీసులో మా డేటా కలెక్టర్ దుర్గాప్రసాద్ ఒక ఎనాలిసిస్ ను నిర్వహిస్తున్నారు.

మేము మా కార్యక్రమాల గురించి అందరికి చెప్పడానికి మరియు చేపల జీవితాలను మెరుగుపరచడానికి ఈ అధ్యయనాలను రూపొందించి నిర్వహిస్తున్నాము.

వ్యూహాత్మక భాగస్వామ్యాలు

WhatsApp Image 2024-05-29 at 10.53_edited.jpg

కైకలూరులో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ తో కలిసి సమావేశమైన తర్వాత మా స్టాఫ్.

మేము NGOలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ అధికారులతో కలిసి చేపల సంక్షేమాన్ని మెరుగుపరుస్తున్నాం.

రైతుల నిమగ్నత

మా ప్రధాన ప్రోగ్రామ్ అయిన అలయన్స్ ఫర్ రెస్పాన్సిబిల్ ఆక్వాకల్చర్ (ARA) ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని రైతులతో ప్రత్యక్షంగా, క్షేత్రస్థాయిలో కలిసి మేము పనిచేస్తాం.

a11_edited.jpg

మా రైతుల ప్రోగ్రామ్స్ మేనేజర్, చైతన్య, ఒక పార్టనర్ రైతుతో మాట్లాడుతున్నారు, అదే సమయంలో మా డేటా కలెక్టర్ నీటి నాణ్యతను పరీక్షిస్తున్నారు.

ARA రైతుల నుంచి ప్రశంసాపత్రాలు

"ARA ప్రోగ్రామ్ లో చేరిన తర్వాత, డేటా కలెక్టర్ క్రమం తప్పకుండా చెరువును సందర్శించి పరీక్షలు చేస్తారు, కాబట్టి నేను ఇప్పుడు ల్యాబ్ లకు వెళ్ళడం పూర్తిగా మానేశాను. నీటి నాణ్యతలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడంలో వాళ్ళు ఇచ్చిన సలహాలు కూడా చాలా సహాయపడ్డాయి.

 

నేను ప్రతి రెండు రోజులకు ఒకసారి పులియబెట్టిన రసాలను ఉపయోగిస్తున్నందుకు చెరువులో అధిక pH సమస్య వచ్చింది. చెరువును సందర్శించిన తర్వాత, DC ఈ పరిస్థితిని సమీక్షించి వాడుక గ్యాప్ ను 4 రోజులకు పెంచమని చెప్పారు, దానితో pH సమస్య రెండు రోజుల్లోనే పోయింది."

ఏలూరు, మానూరుకు చెందిన రైతు మురార్జీ

మా గురించి

ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇండియా, 2021 నుంచి భారతదేశంలో పెరుగుతున్న చేపల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తూ వస్తుంది. మేము భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయిన ఒక నాన్-ప్రాఫిట్ ఆర్గనైసేషన్.

మాతో కనెక్ట్ అయ్యి మా పనికి సపోర్ట్ చెయ్యండి

DSC_7453_edited.jpg
Partners Anchor

మా భాగస్వాములు

మా పనిని ముందుకు తీసుకెళ్లడానికి మేము ఈ క్రింది సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము.

Dvara-Holdings-Logo.png
ezgif.com-gif-maker__3_-removebg-preview.png
ezgif.com-gif-maker__4_-removebg-preview.png
People_for_Animals_Official_Logo.png
ezgif.com-gif-maker-removebg-preview.png
ezgif.com-gif-maker__2_-removebg-preview.png
MercyforAnimals_PrimaryLockup_RGB.png
Ahimsa Fellowship Final Logo_png (1).png
bottom of page