top of page
ARA Page top picture.jpg

భారతదేశంలోని 505 మంది చేపల పెంపకపు రైతులపై చేసిన మా సర్వే ఫలితాలు

అభిషేక్ పాండే

మా ఫిష్ వెల్ఫేర్ నిపుణుడు, వివేక్ రాచూరి గారు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో చేపల పెంపకపు రైతులను కలుసుకున్నారు.

ఈ రిపోర్ట్ లో, మేము మార్చి 2023 లో కండక్ట్ చేసిన భారతీయ ఆక్వాకల్చర్ రైతుల యొక్క పెద్ద సర్వే యొక్క ఎనాలిసిస్ ను అందిస్తున్నాము. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని చెరువులలో భాగస్వామ్య లక్షణాలు, సర్వే చెయ్యబడిన ప్రాంతాలలో వేరియేషన్లు మరియు పెంపకపు చేపలలో మారుతున్న అవసరాల ఆధారంగా మా ఫిష్ వెల్ఫేర్ స్టాండర్డ్ ను మార్చడానికి ఈ పరిశోధన మాకు బాగా సహాయపడుతుంది.

ఈ సర్వే నుంచి నేర్చుకున్న విషయాలు

ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రాంతాల్లో 505 మంది రైతులను మేము సర్వే చేశాము. మా ఫీల్డ్ పనులకు సంబంధించిన ప్రాంతాలలో రైతుల గురించి, చెరువులు మరియు పెంపకపు పద్ధతులపై మా అవగాహనను లోతుగా అర్థం చేసుకోవడమే మా లక్ష్యం.

ఈ సర్వే అధిక-సంక్షేమ ఆక్వాకల్చర్ యొక్క వివిధ అంశాలను కలిగి ఉంది: రైతులు మరియు డెమోగ్రఫీ, చేపల సంక్షేమంపై అవగాహన, పెంపకపు లక్షణాలు మరియు పెంపకపు పద్ధతులు కూడా ఉన్నాయి.

 

దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆక్వాకల్చర్ రైతులను మేము సర్వే చేశాం. ఈ మ్యాప్ అవుట్ డేటెడ్, కానీ మేము సర్వే చేసిన ప్రాంతాలను ఇది  సరిగ్గా సూచిస్తుంది. సోర్స్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

పెద్ద సంఖ్యలో రైతుల నుంచి సొంతగా రిపోర్ట్ చెయ్యబడిన సమాచారాన్ని సేకరించడం ఈ క్రింది విషయాలను అర్ధం చేసుకోవడంలో మాకు బాగా సహాయపడింది.

చేపల పెంపకానికి అధిక-సంక్షేమ వాతావరణం చాలా ముఖ్యమైనదని రైతులు నమ్ముతారు.

"చేపలకు అధిక-సంక్షేమ వాతావరణం ఉండటం ఎంత ముఖ్యం అని మీరు అనుకుంటున్నారు?" అని వాళ్ళను అడిగినప్పుడు, 62% కంటే ఎక్కువ మంది రైతులు "చాలా ముఖ్యమైనది" అని సమాధానమిచ్చారు. చేపల భద్రత, శ్రేయస్సు మరియు ఆరోగ్యం చెరువులలో వాటి జీవన వాతావరణంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని చాలా మంది రైతులకు తెలుసని మేము నమ్ముతున్నాము. చేపల సంక్షేమ అవసరాలను తీర్చడంలో మా దిద్దుబాటు చర్యలు సరిగ్గా తెలుసుకుని మా పనులలో బాగా సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము.

చాలా మంది రైతులు మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ను వాడుతూ మార్కెట్ ధరలకు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటున్నారు. ప్రస్తుతం, రైతులు ఈ సమాచారం కోసం ట్రేడర్స్ పై ఆధారపడతారు - వాళ్ళు రైతులు మరియు చేపల కొనుగోలు దారుల మధ్య ఉండే మిడిల్ మెన్.

రైతులు ట్రేడర్స్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి చూస్తున్నారని, మరియు ఎక్కువ అటానమీ, మార్కెట్ సమాచారం పొందడానికి ఆసక్తి చూపుతారని ఇది మాకు చెప్తుంది. అటువంటి అటానమీని మనం ప్రేరేపించగలిగితే, రైతులతో బలమైన సంబంధాలను పెంపొందించుకోగలుగుతాము మరియు మా ఫీల్డ్ సైట్లలో వ్యవసాయ సంఘాలతో కలిసి మంచి సహకార వాతావరణాన్ని పెంపొందించగలము.

ea10fd_1c6c795fecc141de9624415ce30d87c7~mv2.webp

మా డేటా కలెక్టర్ ఎన్.వెంకయ్య భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఉన్న ఒక చెరువులో నీటి నాణ్యత పారామీటర్లను (pH లాంటివి) కొలుస్తున్నారు.

రైతులు మార్కెట్ లింకేజీలు, వ్యవసాయ పెట్టుబడి లేదా ఆర్థిక సహాయానికి యాక్సెస్ కంటే నీటి నాణ్యత పరీక్షకు ఎక్కువ ప్రాధ్యాన్యతను ఇస్తారు. చాలా చెరువులలో, నీటి నాణ్యతను నెలకు ఒకటి లేదా రెండుసార్లు పరీక్షిస్తారు. తక్కువ సార్లు చేసే చోట పరీక్షల మధ్య మూడు నెలల గ్యాప్ ఉంటుంది.

అలయన్స్ ఫర్ రెస్పాన్సిబిల్ ఆక్వాకల్చర్ లోని రైతులందరికీ మేము ఉచిత నీటి నాణ్యత పరీక్షలను అందిస్తాము మరియు దీన్ని ఇలాగే కొనసాగిస్తాము. చేపల కోసం అధిక-సంక్షేమ వాతావరణాన్ని మెయింటైన్ చెయ్యడానికి ఆ పద్ధతులను వాడడానికి రైతులకు ఎప్పటికప్పుడు ఫీల్డ్ లోని నీటి నాణ్యత పరీక్షకు యాక్సెస్ అందించడం ఒక బలమైన ప్రోత్సాహకంగా ఉంటుందని ఈ సర్వే మాకు తెలియజేస్తుంది.

చాలా చెరువులకు కరంటు (రోజులో కనీసం 12 గంటలు) మరియు నీళ్లు (సంవత్సరంలో తొమ్మిది నెలల వరకు) అందుబాటులో ఉన్నాయి. చాలా చెరువులకు పరికరాలు లేవు, మరియు ఉన్న చెరువులలో ప్యాడిల్ వీల్ ఎయిరేటర్లు ఉన్నాయి.

మెరుగైన చేపల సంక్షేమానికి సరైన ఎయిరేషన్ బాగా సహాయపడుతుంది: ఎయిరేషన్ నీటిలోకి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది, దీన్ని డిసోల్వ్డ్ ఆక్సిజన్ లేదా DO అని పిలుస్తారు. దీన్ని చేపలు నీటి నుంచి పీల్చుకుంటాయి. DO స్థాయిలు చాలా తక్కువగా లేదా ఎక్కువసేపు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, ఇది చేపల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మా రికమండేషన్లు మెరుగైన సంక్షేమం కోసం DO-లెవెల్ ని సూచించడమే కాకుండా, తక్కువ DO కోసం దిద్దుబాటు చర్యగా ఎయిరేటర్లను ఉపయోగించాలని కూడా సూచిస్తున్నాయి. అదే విధంగా, నీటి లభ్యత లేకపోవడం వల్ల చెరువులో నీటి స్థాయిలు తక్కువగా ఉంటాయి, ఇది చేపలను నెగెటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది.

7bb0ed_6539cbf2acaa4c0b8ba8890ca7edfb34~mv2.webp

చేపలు పీల్చడానికి నీటిలో గాలిని (ఆక్సిజన్) ప్రవేశపెట్టడానికి ఉపయోగించే ఒక సాధారణ ప్యాడిల్ వీల్ ఎయిరేటర్.

ఒక రైతు చేపలకు ఎంత ఆహారం అయితే సరిపోతుందో (దీన్ని బ్లైండ్ ఫీడింగ్ అంటారు) లేదా చేపలు పూర్తిగా సంతృప్తి చెందే వరకు తెలుసుకుని ఆహారం ఇస్తాడు. చాలా చెరువులలో నెలలో రెండు రోజుల వరకు చేపలకు ఆహారం ఇవ్వకుండా ఉండడం కూడా మామూలు విషయమే, ఈ సమయంలో చేపలు సహజంగా లభించే ఫైటోప్లాంక్టన్లను మాత్రమే తింటాయి. కొన్ని సమాన చెరువులలో ఆహారాన్ని ఇవ్వడం ఆపరు.

పెంచుతున్న చేపలకు అందించే మేత అనేది వాటి జీవన నాణ్యతలో ఒక ముఖ్యమైన విషయం. చాలా తక్కువ మేత చేపలలో పోషకాహారాన్ని తగ్గిస్తుంది, మరియు ఎక్కువ మేత అవి ఉండే నీటి నాణ్యతను తగ్గిస్తుంది. 

చెరువు తయారీ అనేది అధిక చేపల సంక్షేమానికి సానుకూల వాతావరణాన్ని మెయింటైన్ చెయ్యడానికి అవసరమైన ఒక ప్రాసెస్, ఇది ఒక సాధారణ చెరువులో కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి జరపబడుతుంది.

రైతులకు ప్రతి ఆక్వాకల్చర్ సైకిల్ కి ముందు (సుమారు తొమ్మిది నెలల సమయంలో) చెరువు తయారీ చెయ్యాలని మేము రికమండ్ చేశాము. ఏదేమైనా, అలయన్స్ ఫర్ రెస్పాన్సిబిల్ ఆక్వాకల్చర్ లో ఇది ప్రధాన అవసరం కాదు. తరచూ చెరువులను సిద్ధం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతటా చెరువులలో మెరుగైన సంక్షేమ ఫలితాలు లభిస్తాయి; మా అనుభవంలో, రైతులు ఈ సమయం తీసుకుని రిసోర్స్-ఇంటెన్సివ్ ప్రాసెస్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చెయ్యరు. చెరువుల తయారీని ప్రోత్సహించడానికి, రైతులు ఎందుకు ఆసక్తి చూపరో మరియు రైతులకు ఎంపవర్ చెయ్యడానికి కావలసిన శిక్షణ లేదా రిసోర్స్ లను ఎలా అందించాలో మేము ఇంకా పరిశోధన చెయ్యాల్సి ఉంది.

ea10fd_ae517a7e0bab4b73a62a647938f3e81f~mv2.webp

వివేక్ రాచూరి, మా ఫిష్ వెల్ఫేర్ ఎక్స్పర్ట్, చేపలు తినడానికి నీటిలో మేత వెయ్యడానికి ఉపయోగించే రీయూసబుల్ బ్యాగ్ ని పట్టుకున్నారు.

మేము అధ్యయనం చేసిన నాలుగు జిల్లాల్లో రైతులు పొటెన్షియల్ ఇన్సెంటివ్ లు, చేపల మేత యొక్క కంపోసిషన్ మరియు విద్యుత్ లభ్యతకు ఎలా ప్రాధాన్యత ఇస్తారో అనే విషయాల్లో తేడా ఉంది.

మా ప్లాన్ తో మేము ముందుకు వెళ్తున్నప్పుడు, ఈ ప్రాంతీయ వైవిధ్యాలను ఎదుర్కోవటానికి మరియు వాటి కోసం సిద్ధంగా ఉండాలి. వ్యవసాయ లక్షణాలలో ప్రాంతీయ ట్రెండ్స్ పై ఎక్కువ పరిజ్ఞానాన్ని సేకరిస్తున్నప్పుడు మన వెల్ఫేర్ స్టాండర్డ్ మరియు మా దిద్దుబాటు పనులు రెండింటినీ అప్డేట్ చెయ్యాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో వాతావరణం, నీటి నాణ్యత తక్కువగా ఉండటం, కాలుష్యం అనేవి వ్యాధులు, మరణాలకు ఉన్న మూడు కారణాలుగా రైతులు చెబుతున్నారు.

దీన్నిబట్టి ఒక రైతు యొక్క ముఖ్యమైన సమస్యలను లక్ష్యంగా చేసుకుని అతని *చెరువులో అధిక-సంక్షేమ పద్ధతులను అమలు చెయ్యడంలో అడ్డంకులను పరిష్కరించడానికి ఎలా సహాయపడుతుందో మేము అంచనా వేశాము. క్రమం తప్పకుండా పరీక్షించడం, పర్యవేక్షించడం మరియు శిక్షణ ఇవ్వడం ద్వారా నీటి నాణ్యతను మెరుగుపరచడానికి మా పని సైజు మరియు ప్రభావం రెండింటిలోనూ విస్తరిస్తున్నప్పుడు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము.

*మా సర్వేలో కేవలం 3 శాతం మంది రైతులు మాత్రమే మహిళలు ఉన్నారని తేలింది.

పెద్ద సర్వే డిజైన్ చెయ్యడం

ఆబ్జెక్టివిటీని ధృవీకరించడానికి, క్వాంటిటేటివ్ రెస్పాన్స్ లను ప్రోత్సహించే సర్వే ప్రశ్నలను మేము రూపొందించాము. ఈ సర్వేను ఖరారు చెయ్యడానికి 2.5 వారాలు పట్టింది, ఇది మా ప్రస్తుత ప్రయత్నాలకు అర్థవంతమైన డేటాను అందించడానికి నిపుణుల సంప్రదింపులను చేర్చింది.

పాల్గొనే రైతులందరూ స్వచ్ఛందంగా వాళ్ళ కాన్సెన్ట్ ను ఇచ్చారు, అలా ఈ స్టడీ మొత్తంలో నైతిక పరిగణనలు సమర్థించబడ్డాయని ధృవీకరించబడింది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లోని 810 వ్యక్తిగత చెరువుల సమాచారంతో సహా మొత్తం 505 మంది రైతులను మేము సర్వే చేశాము.

ea10fd_f86654a9017e472b8d889040886ba439~mv2.jpg

మా కార్పొరేట్ ఔట్ రీచ్ మేనేజర్ సుబ్రతా దేబ్, మార్కెట్ లింకేజీలపై వారి ఆలోచనలను అర్థం చేసుకోవడానికి మా ఫీల్డ్ సైట్ లలో రైతులను కలిశారు.

సర్వే ప్రభావం

ఆంధ్రప్రదేశ్ లో ఒక సాధారణ రైతు యొక్క వివరణాత్మక వ్యవసాయ లక్షణాలు, సాధారణ చెరువులోని సవాళ్లు మరియు ప్రాధాన్యతలపై ద్రుష్టి పెట్టడానికి మేము ఈ సర్వేను నిర్వహించాము. ఈ ఉద్దేశపూర్వక దృష్టి మా సంక్షేమ పనులను మెరుగుపరచడానికి అవసరమైన డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సర్వే ఫలితాలు మా ఫీల్డ్ సైట్లను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని మేము నమ్ముతున్నాము. ఆ విధంగా చిన్న, గ్రామీణ ఫార్మింగ్  విషయంలో ప్రభావవంతంగా ఉండటమే కాకుండా సాధ్యమయ్యే పనులు మరియు మార్గదర్శకాలను మేము రూపొందిస్తాము.

 

తర్వాతి పరిశోధన మరియు ప్రయోగాల కోసం టార్గెట్ లను గుర్తించడానికి కూడా ఈ సర్వే మాకు సహాయపడింది. తర్వాతి పోస్ట్ లలో దీనికి సంబంధించిన అప్డేట్ లను మేము మీతో షేర్ చేసుకుంటాము.

bottom of page